gulab jamun la vindu



కాలాజామూన్ 

Image result for kala jamun












కావలిసినవి :

గులాబ్ జామున్  పొడి - రెండుకప్పులు
పాలు - పావుకప్పు 
ఇలాచీ పొడి - చెంచా 
ఆకుపచ్చ రంగు - చిటికెడు 
చక్కర - టబుల్స్పూన్ 
నూనె - సరిపడా 

పాకం కోసం : 

చక్కర - రెండుకప్పులు 
నీళ్లు  -  రెండుకప్పులు 
చక్కెరపొడి - అరకప్పు 

తయారీ :

      గులాబ్ జామున్ పొడి, పాలు ఒక గిన్నెలోకి తీసుకోని కలపాలి. తరువాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ముద్దలా కలపాలి. ఇందులోనుంచి పావు ముద్దను , విడిగా తీసి , ఆకుపచ్చ ఆహా ర రంగు , చక్కెరా, ఇలాచీ పొడి వేసి మరోసారి కలపాలి. మొదట కలిపినా పిండిని, ఆకుపచ్చ రంగు , ఉన్న ముద్దనూ చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి.  అంచులు మూసి ,మల్లి ఉండాలా చేసుకోవాలి. ఇలాగే మిగిలినవి , చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఉండల్ని రెండు చొప్పున కాగుతోన్న నూనె వే సి కాస్త నల్లగా అయ్యేవరకు వేయించుకొని తీసుకోవాలి. ఇంతలో చక్కర , నీళ్లు ఓ గిన్నెలోకి తీసుకోని తీగపాకం పట్టి దింపేయాలి.  వీడి కాస్త చల్లారాక ముందు గా వేయించి పెట్టుకున్న ఉండాలని పాకంలో వేసి కాసే పు అయ్యాక ఇవతలకు తీయాలి. వాటిని చక్కెర పొడి , లో ముంచి తీసేయాలి.  అంతే వేడి వేడి గా కాలాజామూన్ రెడీ. 

Comments