రోస్టెడ్ పీస్
కావలసినవి :-
- పచ్చిబఠాణీ -రెండుకప్పులు
- నూనె - రెండున్నార్రా టేబుల్ స్పూన్లు
- ఉప్పు - తగినంత
- మిరియాలపొడి -అరచెంచా
- జీలకర్ర పొడి - అరచెంచా
- వెలుల్లి పొడి - అరచెంచా
- ధనియాలపొడి - పావుచెంచా
- ఉప్పు - తగినంత
తయారీ:
వేడ ఆలపాటి ఓవెన్ పాత్రకు నూనె రాసి పెట్టుకోవాలి. పచ్చిబఠాణీ లను కడిగి తరువాత తడిపోయే అంత వరకూ తుడిచి ఓ గిన్నెలో కి తీసుకోవాలి. ఇందులో మిగిలిన నూనెతో పాటూ ఇతర పదార్ధాలు అన్ని వేసి బాగా కలపాలి. ఈ బఠాణీలను నూనె రాసిన పాత్రలో తీసుకుని కనీసం నలభై నిముషాలు బేక్ చేసుకొని తీసుకోవాలి. అయితే ప్రతి పదిహేను నిమిషాలకోసారి బఠాణీలను ఇవతల కు తీసి ఓసారి కలిపి మల్లి ఓఎన్ లో పెట్టాలి. ఇలా తయారు చేసుకున్న బఠాణీలు బాగా చల్లారేక డబ్బాలో తీసుకుంటే రెండుమూడు రోజులు నిల్వ ఉంటాయి.
Comments
Post a Comment