katorichaat









కటోరి  చాట్ 







           
Image result for katorichaat





కాటోరీ చాట్ :-

  • ఓట్స్- అరకప్పు 
  • మైదా - అరకప్పు 
  • బంగాళాదుంప - ఒకటి 
  • ఉల్లిపాయ - సగం 
  • తెల్లసెనగలు - పావుకప్పు 
  • టమాటా  -  ఒకటి 
  • పెరుగు - రెండుచెంచాలు 
  • కొత్తిమీర - ఒకకప్పు 
  • చింతపండు గుజ్జు - రెండుచెంచాలు
  • బెల్లం - నాలుగు చెంచాలు 
  • చాట్ మసాలా - రెండు చెంచాలు 
  • ఉప్పు - కొంచెం 
  • పంచదార - చెంచా 
  • స్టీల్ గిన్నె - చిన్నది ఒకటి 
  • నూనె - మూడు చెంచాలు 

తయారీ :-

ఒక పాత్రలో ఉప్పు, ఓట్స్,మైదాపిండి తీసుకోని చపాతి పిండిలా ఒత్తాలి .  చిన్న ఉండల్లా చేసుకొని ఈ పిండిని నూనె  రాసిన స్టీల్ గిన్నె చుట్టూ పేల్చ గ ఒత్తుకోవాలి.  దీన్ని అవెన్ లో పెట్టుకొని 200 డిగ్రీల వద్ద నాలుగు నిమిషాల పాటు ఉంచితే కాటో రి  (తినే పాత్రలు ) సిద్ధమవుతాయి .  ఎక్కువగా కటో రి లు కావాలనుకుంటే మఫిన్ ట్రె లని తిరగేసి వాటి చుట్టూ పిండి రాసి ఫోర్కుతో  వెనకవైపు రంధ్రాలు చేసి అవెన్ లో వేడి చేయాలి. కాబూలీ సెనగలని రాత్రి అంతా నానబెట్టి, బంగాళాదుంపతో కలిపి కుక్కర్లో ఉడికించుకోవాలి. కొత్తిమీర ,పంచదార, ఉప్పు మిక్స్లో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. దీనిలో చింతపండుగుజ్జు , బెల్లం వేసి బాగా కలిపినా తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఆలు ముక్కలు, తెల్లసెనగలు, ఉల్లిపాయముక్కలు , ఉప్పు, చాట్ మసాలా , పెరుగువేసి కలిపి కటో రీలు చెమ్చాలతో వేయాలి. పైన చాట్ మసాలా చల్లి వడ్డిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. 


Comments