పోరన్ పోలి
కావలిసినవి
ఓట్స్ పిండి అరకప్పు
గోధుమ పిండి కప్పు
బెల్లం అరకప్పు
ఇలాచీ పొడి పావుచెంచా
ఉప్పు తగినంత
సెనగపప్పు కప్పు
నేయే అరకప్పు
తయారీవిధానం
గోధుమపిండి , ఓట్స్ పిండి కలిపి ఉప్పు వేసి చపాతీపిండిలా ఒత్తుకొని రెండు గంటల పాటు పక్కన ఉంచాలి. కుక్కర్ లో సెనగపప్పు ఉడికించాలి. చల్లారిన తర్వాత అందులో బెల్లం, నేయీ , ఇలాచీపొడి వేసి పొయిమీద పెట్టి వేడిచేస్తూ కలపాలి . ఇందాక మనం పక్కనపెట్టుకున్న చపాతీ పిండి లో కొద్ది గా ఉప్పు , నూనె కూడా కలిపి చిన్న ఉండలుగా చేసుకోవాలి . ఈ ఉండలు మధ్యలో సెనగపప్పు మిశ్రమం ఉంచి నూనె రాసుకుంటూ మిశ్రమం బయటికి రాకుండా ఒత్తు కోవాలి. నేయి తో రెండువైపులా కాల్చు కోవాలి. అంతే పోరంపొలి రెడీ
Comments
Post a Comment