పన్నీర్ పలావ్
బాస్మతి బియ్యం - మూడు కప్పులు
పన్నీరుముక్కలు - ఒక్కటిన్నర కప్పు
పచ్చిబఠాణీలు - కప్పు
నేయీ - కప్పు
వెన్న - రెండు టేబుల్ స్పూన్ చొప్పున
జీలకర్ర - అరచెంచా
అల్లంవెల్లుల్లి ముద్ద - టేబుల్ స్పూన్
మిరియాలు పొడి - రెండు చెంచాలు
ఉల్లిపాయ - ఒకటి
కారం - పావుచెంచా
ఉప్పు - తగినంత
నూనె - చెంచా
నిమ్మకాయ - సగం చెక్క
నిమ్మకాయ - సగం చెక్క
తయారీ :
నానబెట్టుకున్న బియ్యాన్ని రెండుసార్రులు కడిగి చెంచా నూనె వేసి పొడిపొడిగా వండి పెట్టుకోవాలి. వెడల్పాటి బాణలిని పోయి మీద పెట్టి వెన్న , నేయీ వేయాలి. ఆ రెండు కరిగాక జీలకర్ర వేయేంచాలి. రెండు నిమిషాలు అయ్యాక ,అల్లం, వెల్లుల్లి, ముద్ద , మిరియాల పొడి , ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి ఎర్రగా వేగాక కారం, గరం మసాలా, పచ్చి బఠాణి వేసి వేయించాలి. కాసేపు అయ్యాక , పన్నీర్ ముక్కలు ,వండి పెట్టుకున్న అన్నం, తగినంత ఉప్పు ,నిమ్మరసం వేసుకొని బాగా కలిపి దింపేయాలి. అంతే పన్నీర్ పులావ్ రెడీ.
Comments
Post a Comment