డోక్లా
కావలిసినవి:-
- సెనగపిండి - కప్పు
- బొంబాయి రవ్వ - రెండు చెంచాలు
- ఓట్సపిండి - అరకప్పు
- పంచదార - అరకప్పు
- పసుపు - చిటికెడు
- ఉప్పు - తగినంత
- నీళ్లు - రెండుకప్పులు
- వంటసోడా - కొద్దిగా
తయారీ :-
ఇడ్లీ పాత్రలో కానీ డోక్లా పాత్రలో కానీ కప్పునీళ్ళు వేసి మరిగించుకోవాలి . ఇప్పుడు మంటని సన్నని సెగపై ఉంచి డోక్లా కోసం వంటసోడా తప్పించి తక్కినవాణ్ణి కలిపిపెట్టుకోవాలి. ఉండలులేకుండా పిండి కలిపి పెట్టుకున్న తర్వాత ఈ నో పాత్రకు నూనె రాసుకొని అందులో పిండిని వేసుకోవాలి. ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి, పోయి కట్టెసి వెంటనే తీయకుండా కా సేపు చల్లారనివ్వాలి. తరువాత ముక్కలుగా చేసుకోవాలి. ఒక పాన్లో ఇంగువ , ఆవాలు,పర్చిమిర్చి వేసి వేయిచుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసి వేడెక్కాక పంచదార వేసి కరగనివ్వాలి. ఇందులో డోక్లా ముక్కల్ని వేసి , పంచదార నీళ్ళని పీల్చుకొని వ్వాలి. అంతే రుచికరమై న డోక్లా రెడీ.
Comments
Post a Comment